మంగళవారం 04 ఆగస్టు 2020
Sports - Jul 06, 2020 , 00:15:26

కోహ్లీపై ‘విరుద్ధ ప్రయోజనాల’ ఫిర్యాదు

కోహ్లీపై ‘విరుద్ధ ప్రయోజనాల’ ఫిర్యాదు

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలను పొం దుతున్నాడంటూ బీసీసీఐ ఎథిక్స్‌ ఆఫీసర్‌ డీకే జైన్‌కు ఫిర్యాదు అందింది. భారత సారథిగా ఉన్న కోహ్లీ.. ప్రస్తుతం రూపకల్పనలో ఉన్న ఓ వెంచర్‌కు డైరెక్టర్‌గానూ ఉన్నాడని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని డీకే జైన్‌ ఆదివారం వెల్లడించారు. ఈ విషయంలోనే గతంలో గంగూలీ, ద్రవిడ్‌ సహా అనేక మందిపై సంజీవ్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 


logo