మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 15, 2020 , 20:13:34

‘ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్ గెలువగలదు’

‘ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్ గెలువగలదు’

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ గెలువగలిగే సత్తా, అన్ని వనరులు ఆఫ్ఘనిస్థాన్​కు ఉన్నాయని ఆ జట్టు స్టార్​ స్పిన్నర్​ రషీద్ ఖాన్ ఖాన్ అన్నాడు. తమ జట్టు తదుపరి లక్ష్యం మెగాటోర్నీ టైటిలేనని స్పష్టం చేశాడు. రెండేండ్లుగా ఆఫ్ఘన్​ జట్టులో టీ20 స్పెషలిస్టులు పెరిగిపోతున్నారు. ఆ జట్టు నుంచి ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ తరఫున రషీద్ ఖాన్​, మహమ్మద్ నబీ, కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్ తరఫున ముజీబుర్ రహ్మాన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టులో స్టార్లకు కొదువ లేదని, ప్రపంచకప్ గెలుస్తామని రషీద్​ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.

“మేం సాధించాలని వేచి చూస్తున్న అతిపెద్ద లక్ష్యం టీ20 ప్రపంచకప్​. ఎందుకంటే ఆఫ్ఘన్ జట్టులో కావాల్సినంత మంది ప్రతిభావంతులైన, నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. కాకపోతే అందరిలో నమ్మకమే మరింత పెరగాలి. మా జట్టులో టాలెంటెడ్​ స్పిన్నర్లు, పేసర్లు, బ్యాట్స్​మెన్ ఉన్నారు. అయితే మేం రెగ్యులర్​గా టాప్​ జట్లతో ఆడాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మేం మరింత అత్యుత్తమంగా తయారవుతాం” అని రషీద్ ఖాన్ చెప్పారు. 


logo