గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 07, 2020 , 03:18:02

ఒక్క కరోనా కేసు వచ్చినా ఐపీఎల్‌ ఆగమే: వాడియా

 ఒక్క కరోనా కేసు వచ్చినా ఐపీఎల్‌ ఆగమే: వాడియా

న్యూఢీల్లీ: బయో సెక్యూర్‌ వాతావరణంలో చిన్న తప్పిదం జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సహ యజమాని నెస్‌వాడియా అభిప్రాయపడ్డాడు. దుబాయ్‌లో జరుగనున్న ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనా.. లీగ్‌ మొత్తం నాశనం అవుతుందని పేర్కొన్నాడు. ‘ఈ ఐపీఎల్‌ను అత్యధిక మంది వీక్షించకపోతే నా పేరు మార్చుకుంటా. ఇది అత్యుత్తమ ఐపీఎల్‌ కాబోతున్నది. ఈ లీగ్‌లో భాగమవ్వకపోతే స్పాన్సర్లు మూర్ఖంగా వ్యవహరించినట్లే. ఆటగాళ్లు, సిబ్బంది భద్రత గురించే ఆందోళన అంతా. ఎందుకంటే ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైనా లీగ్‌ మొత్తం నాశనం అవుతుంది’అని వాడియా చెప్పుకొచ్చాడు. 

తాజావార్తలు


logo