సోమవారం 13 జూలై 2020
Sports - May 27, 2020 , 00:13:10

ఒక్క ప్లేయర్‌కు కరోనా వచ్చినా అంతే

ఒక్క ప్లేయర్‌కు కరోనా వచ్చినా అంతే

  • ‘బయో సెక్యూర్‌'పై ద్రవిడ్‌ 

న్యూఢిల్లీ: బయోసెక్యూర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (జీవ రక్షణకు అనుకూలమైన వాతావరణం)లో క్రికెట్‌ పునరుద్ధరణను భారత దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ వ్యతిరేకించాడు. అది అవాస్తవికంగా కనిపిస్తున్నదని, ఆచరణలో సాధ్యమయ్యే విషయం కాదని అభిప్రాయపడ్డాడు. వైద్య పరీక్షలు, క్వారంటైన్‌ సహా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఓ ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా తేలితే.. సిరీస్‌ మొత్తం రద్దవుతుందని మిస్టర్‌ డిపెండబుల్‌  అన్నాడు. మంగళ వారం ఓ వెబినార్‌లో ద్రవిడ్‌ మాట్లాడాడు. ‘ఈసీబీ చెబుతున్న ఆ విషయం అవాస్తవికంగా కనిపిస్తున్నది. ఓ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి.. బయో సెక్యూర్‌ ఎన్విరాన్‌మెంట్‌ను సృష్టించినా.. అందరూ దాన్ని పాటించడం అసాధ్యం. ఎన్నో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది, చాలా మంది ప్రమే యం ఉంటుంది’ అని ద్రవిడ్‌ చెప్పాడు. టెస్టు మ్యాచ్‌ మధ్యలో ఒక్కరికి కరోనా ఉన్నట్టు తేలినా మిగిలిన వారంతా మళ్లీ క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తుందని  ద్రవిడ్‌ అన్నాడు.


logo