శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 06, 2020 , 17:20:58

కరోనా కంగారు..టీ20 లీగ్‌ వాయిదా

కరోనా కంగారు..టీ20 లీగ్‌ వాయిదా

న్యూఢిల్లీ:  క్రీడారంగంపై ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్రభావం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా కొన్ని టోర్నీలు, ఈవెంట్లు రద్దవడంతో పాటు మరికొన్ని వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా నేపాల్‌లో జరగనున్న టీ20 లీగ్‌ ఎవరెస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఈపీఎల్‌)ను కరోనా కారణంగా వాయిదా వేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఈపీఎల్‌ మార్చి 14 నుంచి ఆరంభంకావాల్సి ఉంది. కరోనా తీవ్రత తగ్గి, పరిస్థితులు అనుకూలంగా ఉంటే తదుపరి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. 

ఈ టోర్నమెంట్‌లో స్టార్‌ ప్లేయర్స్‌ క్రిస్‌గేల్‌, ఆతిథ్య ఆటగాడు సందీప్‌ లమిచానే, మహ్మద్‌ షెహజాద్‌ తదితరులు లీగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ఇప్పటి వరకు నేపాల్‌లో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జనసమూహాల టోర్నీలను రద్దు చేస్తున్నట్లు ఆదేశ ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 3వేల మందికి పైగా మరణించగా.. లక్షకు పైగా మందికి వ్యాధి సోకింది. 


logo