శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 26, 2020 , 20:15:04

KKR vs KXIP: 10 పరుగులకే 3 వికెట్లు

KKR vs KXIP: 10 పరుగులకే 3 వికెట్లు

షార్జా: ఐపీఎల్‌-13లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌   టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరారు.  మహ్మద్‌ షమీ దెబ్బకు కోల్‌కతా 10 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది.  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  మాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో బంతికి నితీశ్‌ రాణా   గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.  రెండో ఓవర్లో  షమీ రెండు వికెట్లు  పడగొట్టాడు.  నాలుగో బంతికి  రాహుల్‌ త్రిపాఠి (7)   ఔటయ్యాడు.   

ఆప్పుడే క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌(0) ఆరో బంతికి పెవిలియన్‌  చేరడంతోస కోల్‌కతా కష్టాల్లో పడింది.  ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నారు. షమీ వేసిన ఆరో ఓవర్లో మోర్గాన్‌ రెండు ఫోర్లు బాదగా..గిల్‌ రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో 21 పరుగులు వచ్చాయి. వీరిద్దరూ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 8 ఓవర్లకు కోల్‌కతా 3 వికెట్లకు 80 పరుగులు చేసింది. గిల్‌(34),  మోర్గాన్‌(38) క్రీజులో ఉన్నారు.