ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Sep 22, 2020 , 16:40:03

అతని బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేశా: గంగూలీ

అతని బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేశా:  గంగూలీ

దుబాయ్‌:  రాయల్‌ ఛాలెంజర్స్‌  బెంగళూరు యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ అరంగేట్ర ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌ను  దూకుడుగా ఆరంభించిన 20 ఏండ్ల బ్యాట్స్‌మన్‌ దేవదత్‌(56) అర్ధశతకంతో చెలరేగాడు.  పడిక్కల్‌ ఆటను తాను ఎంతగానో ఆస్వాదించినట్లు  బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నారు. తొలి మ్యాచ్‌లోనే కళ్లుచెదిరే ఆటతీరుతో అలరించాడని దాదా ట్విటర్లో  ప్రశంసించాడు.   

'దేవదత్‌ పడిక్కల్‌ బ్యాటింగ్‌ను చూస్తూ చాలా ఎంజాయ్‌ చేశా. లెఫ్ట్‌హ్యాండ్‌  బ్యాట్స్‌మెన్ల ఆటతీరు ఆస్వాదించాలనిపిస్తుందని' దాదా ట్వీట్‌ చేశారు.   పడిక్కల్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన, బ్యాటింగ్‌ స్టైల్‌ను మాజీ క్రికెటర్లు మెచ్చుకున్నారు. ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించడం గొప్ప విషయమన్నారు.