బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 03, 2020 , 00:58:44

మలన్‌ విజృంభణ

మలన్‌ విజృంభణ

  • మూడో టీ20లోనూ దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌ గెలుపు 

కేప్‌టౌన్‌: డేవిడ్‌ మలన్‌ (47 బంతుల్లో 99 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో ఇంగ్లండ్‌ అ ద్భుత విజయం సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టు 9 వికెట్ల తేడాతో ఆతిథ్య సఫారీలపై అలవోకగా గెలిచి టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. 64 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో కెప్టెన్‌ డుప్లెసిస్‌ (52), వాన్‌డర్‌ డసెన్‌ (74) దూకుడుగా ఆడి నాలుగో వికెట్‌కు 127 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు భారీ స్కోరు అందుకుంది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (16) విఫలమైనా.. బట్లర్‌ (67నాటౌట్‌) అండతో మలన్‌ జట్టును గెలిపించాడు. 

అతనొక్కడే..

పొట్టి క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ కొత్త రికార్డు సృష్టించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 900 రేటింగ్‌ పాయింట్ల మార్కు దాటిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మలన్‌ 915 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 


logo