లండన్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. భారత్‌తో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్‌లో క్యాచ్ పట్టే యత్నంలో చేతివేలికి గాయమైంది. చిటికెన వేలికి బలంగా బంతి తాకడంతో నొప్పికి తాళలేక వెంటనే పెవిలియన్ చేరాడు. అయితే 24 గంటలు గడిస్తే గానీ అతడి పరిస్థితిపై ఏం చెప్పలేమని ఇంగ్లండ్ వర్గాలు తెలిపాయి. కెప్టెన్ మోర్గాన్ మాత్రం ‘లివింగ్‌స్టోన్.. పూర్తి ఫిట్‌గా ఉన్నాడు’ అని తెలిపాడు. ఇక ఆ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 20 బంతులకు 30 పరుగులు చేయగా, బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసి 10 పరుగులతో పాటు ఒక వికెట్ తీశాడు. టోర్నీకి లివింగ్‌స్టోన్ దూరమైతే ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.