శనివారం 29 ఫిబ్రవరి 2020
టీ20 థ్రిల్ల‌ర్‌.. 2 ర‌న్స్ తేడాతో నెగ్గిన ఇంగ్లండ్‌

టీ20 థ్రిల్ల‌ర్‌.. 2 ర‌న్స్ తేడాతో నెగ్గిన ఇంగ్లండ్‌

Feb 15, 2020 , 08:42:04
PRINT
టీ20 థ్రిల్ల‌ర్‌.. 2 ర‌న్స్ తేడాతో నెగ్గిన ఇంగ్లండ్‌

హైద‌రాబాద్‌:  హై స్కోరింగ్ థ్రిల్ల‌ర్‌లో.. ఇంగ్లండ్ విక్ట‌రీ కొట్టింది. డ‌ర్బ‌న్‌లో జ‌రిగిన రెండ‌వ టీ20లో రెండు ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యం సాధించింది.  205 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికాకు.. చివ‌రి రెండు బంతుల్లో మూడు ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా..  బౌల‌ర్ టామ్ కుర్ర‌న్ రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు విజ‌యాన్నిందించాడు. చివ‌రి ఓవ‌ర్‌లో సౌతాఫ్రికా 15 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా.. తొలి రెండు బంతుల్లో ఒక సిక్స‌ర్‌, ఒక ఫోర్ కొట్టాడు ప్రిటోరియ‌స్‌. కానీ మూడ‌వ బంతికి అత‌ను ఔట‌య్యాడు. ఆస‌క్తిక‌రంగా సాగిన ఫైన‌ల్ ఓవ‌ర్‌లో.. ద‌క్షిణాఫ్రికా టార్గెట్‌ను అందుకోలేక‌పోయింది.  అంత‌క‌ముందు ఇంగ్లండ్ 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల‌కు 204 ర‌న్స్ చేసింది.  మొయిన్ అలీ 11 బంతుల్లో 39 ప‌రుగులు చేయ‌గా, బెన్ స్టోక్స్ 30 బంతుల్లో 47 ర‌న్స్ చేశాడు.   సౌతాఫ్రికా కెప్టెన్ డీకాక్ కూడా ధీటుగా బ్యాటింగ్ చేశాడు. కేవ‌లం 22 బంతుల్లో అత‌ను 65 ర‌న్స్ చేసి మంచి స్టార్ట్ ఇచ్చాడు.  తొలి టీ20 మ్యాచ్‌ను కేవ‌లం ఒక ర‌న్ తేడాతో ఓడిపోయిన ఇంగ్లండ్‌.. రెండ‌వ టీ20ని రెండు ర‌న్స్ తేడాతో నెగ్గి సిరీస్‌ను 1-1తో స‌మం చేసుకున్న‌ది.  మూడ‌వ టీ20 సెంచూరియ‌న్‌లో ఆదివారం జ‌ర‌గ‌నున్న‌ది. logo