శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Sep 15, 2020 , 00:30:52

రెండో వన్డేలో ఇంగ్లండ్‌ విజయం

రెండో వన్డేలో ఇంగ్లండ్‌ విజయం

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టు 24 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. కెప్టెన్‌ మోర్గాన్‌ (42), రూట్‌ (39), టామ్‌ కరన్‌ (37), రషీద్‌ (35) తలాకొన్ని పరుగులు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో ఆసీస్‌ తడబడింది. 48.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.


logo