శనివారం 08 ఆగస్టు 2020
Sports - Aug 02, 2020 , 12:19:41

రాణించిన బెయిర్‌స్టో...ఇంగ్లాండ్‌దే వన్డే సిరీస్‌

రాణించిన బెయిర్‌స్టో...ఇంగ్లాండ్‌దే వన్డే సిరీస్‌

సౌతాంప్టన్‌:  ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఇంగ్లాండ్‌ టీమ్‌ కైవసం చేసుకున్నది.   రెండో వన్డేలో జానీ బెయిర్‌స్టో(82), శామ్‌ బిల్లింగ్స్‌(46) విజృంభించడంతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.  ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను బెయిర్‌స్టో అందుకున్నాడు.  ఒకదశలో ఇంగ్లాండ్‌ 137 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినప్పటికీ..బిల్లింగ్స్‌, విల్లీ(47)  క్రీజులో నిలబడి జట్టుకు విజయాన్నందించారు. 

213 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 32.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు  కర్టిస్‌ కాంపర్‌ (68) అర్ధశతకంతో రాణించడంతో  ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్ల ధాటికి ఐర్లాండ్‌  91 పరుగులకే 6 వికెట్లు  చేజార్చుకోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది.


logo