సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 12, 2020 , 02:26:06

కొడుకుపై తండ్రి జరిమానా

 కొడుకుపై తండ్రి జరిమానా

దుబాయ్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌పై అతడి తండ్రి క్రిస్‌ బ్రాడ్‌ జరిమానా విధించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు లో యాసిర్‌ షా పట్ల దురుసుగా ప్రవర్తించిన స్టువర్ట్‌కు తన తండ్రి అయిన మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌.. మ్యాచ్‌  ఫీజులో 15 శాతం జరిమానా వేశాడు. పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా యాసిర్‌ను ఔట్‌ చేసినప్పుడు స్టువ ర్ట్‌ బ్రాడ్‌..అసభ్య పదజాలంతో దూషించడాన్ని మ్యాచ్‌ రిఫరీ దృష్టికి అంపైర్లు తీసుకెళ్లారు. ప్రవర్తనా నియామవళిని బ్రాడ్‌ ఉల్లంఘించినట్లు  ఐసీసీ తేల్చింది. జరిమానా, ఓ డీమెరిట్‌ పాయింట్‌ విధించింది. 


logo