శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 17:27:57

ENG vs PAK: టెస్టుల్లో కొత్త నిబంధన

ENG vs PAK: టెస్టుల్లో కొత్త నిబంధన

న్యూఢిల్లీ: ఇంగ్లండ్​, పాకిస్థాన్ మధ్య మొదలైన మూడు టెస్టుల సిరీస్​లో ప్రయోగాత్మకంగా ఓ కొత్త నిబంధనను ఐసీసీ తీసుకొచ్చింది. ఈ సిరీస్​లో ఫ్రంట్​ఫుట్​ నోబాల్​ను టీవీ అంపైర్ ప్రకటించే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఇంగ్లండ్​-ఐర్లాండ్ మధ్య జరిగిన సిరీస్​ ద్వారా వన్డే సూపర్​ లీగ్​లోనూ ఈ రూల్​ అమలులోకి వచ్చింది. టెస్టుల్లోనూ ఇదే విధానాన్ని వినియోగించాలని భావిస్తున్న ఐసీసీ.. ఇంగ్లండ్​, పాక్​ సిరీస్​లో ప్రయోగిస్తున్నది. ఈ విషయాన్ని బుధవారం ట్వీట్​ చేసింది.

“ప్రపంచ టెస్టు చాంపియన్​షిప్​లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న సిరీస్​లో ఫ్రంట్ ఫుట్ నోబాల్ టెక్నాలజీ వినియోగంలోకి వస్తుంది. దీనికి ఇరు జట్లు మద్దతు తెలిపాయి. ఈ సిరీస్​లో టెక్నాలజీ పనితీరును సమీక్షించి భవిష్యత్తులో టెస్టు క్రికెట్​లో వినియోగించాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటాం” ఐసీసీ బుధవారం ట్వీట్​ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సిరీస్ బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న విషయం తెలిసిందే. 


logo