శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 24, 2020 , 01:14:15

ఇంగ్లండ్‌ చేతుల్లో..

ఇంగ్లండ్‌ చేతుల్లో..

సౌతాంప్టన్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టుపై ఇంగ్లండ్‌ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన ఆతిథ్య జట్టు 310 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ జాక్‌ క్రాలీ (267; 34 ఫోర్లు, ఒక సిక్సర్‌) ద్విశతకానికి.. వికెట్‌ కీపర్‌ బట్లర్‌ (152; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్‌ సెంచరీ తోడవడంతో ఇంగ్లండ్‌ 583/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఆదివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్థాన్‌ ఆరంభంలోనే తడబడింది. అండర్సన్‌ (5/56) ధాటికి 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ పాకిస్థాన్‌ను కెప్టెన్‌ అజహర్‌ అలీ (141 నాటౌట్‌; 21 ఫోర్లు), రిజ్వాన్‌ (53) ఆదుకోవడంతో చివరకు 273 పరుగులకు ఆలౌటైంది. 

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 583/8 డిక్లేర్డ్‌ (క్రాలీ 267, బట్లర్‌ 152; ఫవద్‌ 2/46), పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 273 (అజహర్‌ అలీ 141 నాటౌట్‌; అండర్సన్‌ 5/56)


logo