శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 00:12:44

రాణించిన రిజ్వాన్‌

రాణించిన రిజ్వాన్‌

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో పాకిస్థాన్‌ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నది. తొలి ఇన్నింగ్స్‌   ఓవర్‌నైట్‌ స్కోరు 126/5తో శుక్రవారం బరిలోకి    దిగిన పాక్‌ వర్షం పలుమార్లు అంతరాయం కలిగించగా.. 9 వికెట్లకు 223 పరుగుల వద్ద రెండో రోజును ముగించింది. క్రీజులో మహమ్మద్‌ రిజ్వాన్‌(60నాటౌట్‌), నసీమ్‌ షా(1) ఉన్నారు. ఇంగ్లండ్‌ పేసర్లు బ్రాడ్‌, అండర్సన్‌ మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ ఆజమ్‌(47), రిజ్వాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఇంగ్లండ్‌ బౌలింగ్‌ దాడిని సమర్థంగా నిలువరిస్తూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. అయితే బ్రాడ్‌ స్వింగ్‌ బంతిని ఆడబోయిన ఆజమ్‌..బట్లర్‌ చేతికి చిక్కాడు. 18 పరుగుల తేడాతో యాసిర్‌ షా(5), అఫ్రిదీ(0) వెంటవెంటనే వికెట్లు ఇచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్న జట్టును వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిజ్వాన్‌ ఆదుకున్నాడు.  పాక్‌ను గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపిస్తున్నాడు.  


logo