బుధవారం 25 నవంబర్ 2020
Sports - Sep 18, 2020 , 00:41:03

ఆసీస్‌దే సిరీస్‌

ఆసీస్‌దే సిరీస్‌

మాంచెస్టర్‌: మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అలెక్స్‌ క్యారీ (106; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (108; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 302/7 స్కోరు చేసింది. బెయిర్‌స్టో (112) శతక్కొట్టగా.. బిల్లింగ్స్‌ (57), వోక్స్‌ (53) అర్ధశతకాలు చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడ్డ ఆసీస్‌ను క్యారీ, మ్యాక్స్‌వెల్‌ ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు రికార్డు స్థాయిలో 212 పరుగులు జతచేసి జట్టును గెలిపించారు. మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు  సిరీస్‌  దక్కింది.