శుక్రవారం 10 జూలై 2020
Sports - Jun 03, 2020 , 10:28:12

జూలైలో విండీస్‌తో ఇంగ్లండ్ క్రికెట్ సిరీస్‌

జూలైలో విండీస్‌తో ఇంగ్లండ్ క్రికెట్ సిరీస్‌

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్‌తో బ్రేక్ ప‌డిన అంత‌ర్జాతీయ క్రికెట్‌కు మ‌ళ్లీ మంచి రోజులు రానున్నాయి. జూలైలో ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు మూడు టెస్టు మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ది.  ఈ స‌మ్మ‌ర్‌లో వెస్టిండీస్‌తో మూడు టెస్టులు ఇంగ్లండ్ ఆడ‌నున్న‌ది.  దీని కోసం షెడ్యూల్‌ను కూడా రిలీజ్ చేశారు.  జూలై 8వ తేదీన ఈ సిరీస్ ప్రారంభంకానున్న‌ది. జూలై 16న రెండ‌వ టెస్టు, 24న మూడ‌వ టెస్టును నిర్వ‌హించ‌నున్నారు. కేవ‌లం 21 రోజుల వ్య‌వ‌ధిలోనే మూడు టెస్టుల‌ను పూర్తి చేయ‌నున్నారు. బ‌యో సెక్యూర్ వేదిక‌ల్లో ఈ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. జూన్ 9వ తేదీన వెస్టిండీస్‌.. ఓల్డ్ ట్రాఫ‌ర్డ్ చేరుకోనున్న‌ది. క్వారెంటైన్‌, ట్రైనింగ్ త‌ర్వాత‌.. మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ దేశాల‌తో జ‌ర‌గాల్సిన సిరీస్‌ల గురించి త‌ర్వ‌లో నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొన్న‌ది.  


logo