ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో డే అండ్ నైట్ టెస్ట్

హైదరాబాద్: భారత పర్యటనకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు రానున్నది. దానికి సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. భారత్‌తో ఇంగ్లండ్ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన టూర్ స్టార్ట్కానున్నది. అయితే అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 24వ తేదీన నుంచి రెండు జట్ల మధ్య డే అండ్ నైట్ టెస్ట్ జరగనున్నది. కోవిడ్ వల్ల ఇండియాలో అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మార్చిలో సౌతాఫ్రికా జట్టుతో జరగాల్సిన సిరీస్‌ను రద్దు చేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను దుబాయ్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలో టూర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగే డే అండ్ నైట్ టెస్ట్ కొత్తగా నిర్మించిన మోతెరా స్టేడియంలో జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్‌తో జరిగే క్రికెట్ సిరీస్‌ను కేవలం మూడు వేదికల్లో మాత్రమే నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
తొలి టెస్టు, చెన్నైలో.. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు
రెండవ టెస్టు, చెన్నైలో.. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు
మూడవ టెస్టు, అహ్మదాబాద్‌లో.. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు
నాలుగవ టెస్టు, అహ్మదాబాద్‌లో.. మార్చి 4 నుంచి 8 వరకు
అయిదు టీ20 మ్యాచ్‌లనూ అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. మార్చి 12, 14, 16, 18, 20 తేదీల్లో ఆ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇక వన్డే మ్యాచ్‌లు పుణె వేదికగా జరగనున్నాయి. మార్చి 23, 26, 28వ తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఉంటాయని బీసీసీఐ కార్యదర్శి జే షా వెల్లడించారు.