మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 02, 2020 , 15:07:57

టీ 20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ టాప్‌.. ఇండియాకు మూడో ర్యాంకు

టీ 20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ టాప్‌.. ఇండియాకు మూడో ర్యాంకు

టీ 20 ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్‌  మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్ నంబర్ -1 స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఇవాళ ముగిసిన టీ 20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాను 3-0 తో క్లీన్ స్వీప్ చేయడంతో ఇంగ్లిష్ జట్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నది. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ కూడా నంబర్ -1 స్థానంలో ఉండగా, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నది. టీ 20 లో ఆస్ట్రేలయా రెండో స్థానంలో, టీమిండియా మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి. వన్డేల్లో భారత్ రెండవ, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నది. ఆస్ట్రేలియాలో భారత్ 3 టీ 20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో భారత్‌కు తన రేటింగ్ పాయింట్లను పెంచుకునే అవకాశం ఉంటుంది. టీ 20 లో బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అతని భాగస్వామి ముజీబ్-ఉర్-రెహమాన్ రెండో స్థానంలో ఉన్నారు. మూడవ స్థానంలో ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ అష్టన్ ఎగ్గర్ ఉన్నారు. ఆల్ రౌండర్లలో, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొహమ్మద్ నబీ మొదటి స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ రెండవ స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్వెల్ మూడవ స్థానంలో ఉన్నారు. టీ 20 బౌలింగ్‌ టాప్‌ 10లో టీమిండియాకు చెందిన ఒక్కరు కూడా లేకపోవడం విషేశం.

డేవిడ్ మలన్ టాప్ బ్యాట్స్‌మన్

టీ 20 లో ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ టీ 20 లో మొదటి స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం రెండో స్థానంలో, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మూడో, లోకేష్ రాహుల్ నాల్గవ స్థానంలో ఉన్నారు. కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 9 స్థానంలో ఉన్నారు.


logo