లండన్: ఇంగ్లండ్ స్పిన్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కెరీర్‌ను పొడిగించుకునేందుకు సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. 34 ఏండ్ల మోయిన్ అలీ ఇంగ్లండ్ తరఫున 64 టెస్టులు ఆడి 28.29 సగటుతో 2914 పరుగులు చేయడంతో పాటు 36.66 సగటుతో 195 వికెట్లు పడగొట్టాడు. ‘క్రికెట్లో టెస్టులే అత్యుత్తమం. అయితే వయసు రిత్యా పరిమిత ఓవర్ల క్రికెట్ కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా. ఇక మీదట అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడలేకపోతాననే ఊహ కలవరపెడుతున్నది. అయినా జీవితంలో ముందుకు సాగడమే ముఖ్యం’ అని అలీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.