సోమవారం 08 మార్చి 2021
Sports - Feb 05, 2021 , 11:39:37

చెన్నై టెస్ట్‌.. 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌

చెన్నై టెస్ట్‌.. 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌

చెన్నై: ఇండియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్ నిల‌బ‌డి త‌డ‌బ‌డింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ టీమ్‌.. లంచ్ స‌మ‌యానికి 2 వికెట్లు కోల్పోయి 67 ప‌రుగులు చేసింది. ఇంగ్లిష్ టీమ్‌కు ఓపెన‌ర్లు రోరీ బ‌ర్న్స్ (33), డోమ్ సిబ్లీ (26 నాటౌట్‌) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్ద‌రూ క‌లిసి తొలి వికెట్‌కు 63 ప‌రుగులు జోడించారు. 2017 త‌ర్వాత ఇండియాలో ప‌ర్య‌టిస్తున్న టీమ్ త‌ర‌ఫున 50కిపైగా పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పిన తొలి ఓపెనింగ్ జోడీ వీళ్ల‌దే కావ‌డం విశేషం.  అయితే లంచ్‌కు ముందు రెండు ఓవ‌ర్ల వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో రివ‌ర్స్ స్వీప్ ఆడ‌బోయిన బ‌ర్న్స్.. వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు క్యాచ్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన లారెన్స్ (0) బుమ్రా బౌలింగ్‌లో వికెట్ల‌కు అడ్డంగా దొరికిపోయాడు.  ప్ర‌స్తుతం క్రీజులో 100వ టెస్ట్ ఆడుతున్న కెప్టెన్ రూట్ (4), ఓపెన‌ర్ సిబ్లీ ఉన్నారు. 

VIDEOS

logo