శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Feb 08, 2021 , 14:17:40

టీ టైమ్‌.. ఇంగ్లండ్ ఆధిక్యం 360 ప‌రుగులు

టీ టైమ్‌.. ఇంగ్లండ్ ఆధిక్యం 360 ప‌రుగులు

చెన్నై: ఇండియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ప‌టిష్ఠ స్థితిలో నిలిచింది. నాలుగో రోజు టీ స‌మయానికి ఆ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల‌కు 119 ప‌రుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 241 ప‌రుగుల ఆధిక్యం కలుపుకొని ఓవ‌రాల్‌గా 360 ప‌రుగుల లీడ్‌లో ఇంగ్లండ్ ఉంది. అంత‌కుముందు టీమిండియా 337 ప‌రుగుల‌కే ఆలౌటైన విష‌యం తెలిసిందే. కోహ్లి సేన‌ను ఫాలో ఆన్ ఆడించే అవ‌కాశం ఉన్నా.. ఆ ప‌ని చేయ‌ని ఇంగ్లండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ ప‌రుగులు చేసి ఇండియ‌న్ టీమ్ ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచాల‌ని భావిస్తోంది. ధాటిగా ఆడే ప్ర‌య‌త్నంలో ఇప్ప‌టికే 5 వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌల‌ర్ల‌లో అశ్విన్ 3, బుమ్రా, ఇషాంత్ చెరొక వికెట్ తీసుకున్నారు.

VIDEOS

logo