గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 22, 2020 , 00:27:28

క్రాలె సెంచరీ... ఇంగ్లండ్‌ భారీ స్కోరు

క్రాలె సెంచరీ... ఇంగ్లండ్‌ భారీ స్కోరు

సౌతాంప్టన్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్‌కు ఓపెనర్‌ బర్న్స్‌(6) రూపంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అఫ్రిది బౌలింగ్‌లో బర్న్స్‌.. మసూద్‌ క్యాచ్‌తో ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 12 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన  సిబ్లే(22), కెప్టెన్‌ రూట్‌(29) వెనుదిరగడంతో ఓ దశలో ఇంగ్లండ్‌ 127 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జాక్‌ క్రాలె(171 నాటౌట్‌) సెంచరీతో ఆదుకున్నాడు. బట్లర్‌(87 నాటౌట్‌)తో కలిసి క్రాలె..ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశాడు. వీరిద్దరు కలిసి పాక్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ సాధికారిక ఇన్నింగ్స్‌ ఆడారు. తొలిరోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. టెస్టుల్లో క్రాలెకు ఇది తొలి సెంచరీ. 


logo