గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 13:07:07

ఆసీస్‌తో తొలి వ‌న్డే.. ఇంగ్లండ్ ఓట‌మి

ఆసీస్‌తో తొలి వ‌న్డే.. ఇంగ్లండ్ ఓట‌మి

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఇంగ్లండ్ 19 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఓల్డ్ ట్రాఫ‌ర్డ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో 295 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ ఓ ద‌శ‌లో 57 ర‌న్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే బిల్లింగ్స్‌(118) సెంచ‌రీ,  బెయిర్‌స్టో(88) రాణించినా.. ఇంగ్లండ్ చివ‌ర్లో ల‌క్ష్యాన్ని  అందుకోలేక‌పోయింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ హేజ‌ల్‌వుడ్ ఆరంభంలో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. ర‌న్ రేటులో వెనుక‌ప‌డ్డ ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 275 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. అంత‌క‌ముందు ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 294 ర‌న్స్ చేసింది.  మిచెల్ మార్ష్‌, మ్యాక్స్‌వెల్ ఇద్ద‌రూ 126 ప‌రుగుల‌ భాగ‌స్వామ్యంతో ఆస్ట్రేలియా భారీ స్కార్ చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బిల్లింగ్స్ అద్భుతంగా రాణించినా.. ఆ జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చ‌లేక‌పోయాడు. లెగ్ స్నిన్న‌ర్ ఆడ‌మ్ జంపా 4, హేజ‌ల్‌వుడ్ మూడు వికెట్లు తీసుకున్నారు. మూడు వ‌న్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని న‌మోదు చేసింది. ఈ విక్ట‌రీతో ఆస్ట్రేలియా.. ఐసీసీ మెన్స్ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ సూప‌ర్ లీగ్‌లో త‌న పాయింట్ల ఖాతాను తెరిచింది.  ఐర్లాండ్‌తో క‌లిసి  ప‌ది పాయింట్ల‌తో ఆస్ట్రేలియా స‌మానంగా నిలిచింది. 

   స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా 294-9 (మ్యాక్స్‌వెల్ 77, మార్ష్ 73, వుడ్ 3-54, ఆర్చ‌ర్ 3-57)‌

ఇంగ్లండ్ 275-9 (బిల్లింగ్స్ 118, బెయిర్‌స్టో 84, జంపా 4-55, హేజ‌ల్‌వుడ్ 3-26)logo