ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 06, 2021 , 11:59:02

చెన్నై టెస్ట్‌.. ఇంగ్లండ్ 355/3

చెన్నై టెస్ట్‌.. ఇంగ్లండ్ 355/3

చెన్నై:  భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు రెండ‌వ రోజు ఇంగ్లండ్ భోజ‌న విరామ స‌మ‌యానికి మూడు వికెట్లు కోల్పోయి 355 ర‌న్స్ చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 156, బెన్ స్టోక్స్ 63 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.  ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు భార‌త బౌల‌ర్ల‌ను ఈజీగా ఎదుర్కొన్నారు. పెద్ద‌గా ప్ర‌భావం లేని పిచ్‌పై.. రూట్‌, స్టోక్స్‌లు ప‌రుగుల ప్ర‌వాహం సృష్టించారు. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టికే నాలుగో వికెట్‌కు 92 ర‌న్స్ జోడించారు. అయితే స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ల‌ను మ‌నోళ్లు రెండుసార్లు వ‌దిలేశారు. వందో టెస్టు ఆడుతున్న రూట్‌.. 156 ర‌న్స్‌తో నిల‌క‌డ‌గా క‌న‌బ‌డుతున్నాడు.  డ‌బుల్ సెంచ‌రీ దిశ‌గా రూట్ వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. స్టోక్స్ కూడా భారీ షాట్ల‌తో అల‌వోక‌గా ఇండియ‌న్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొంటున్నాడు. 


VIDEOS

logo