సోమవారం 18 జనవరి 2021
Sports - Nov 28, 2020 , 09:36:49

బెయిర్‌స్టో సూప‌ర్ షో..

బెయిర్‌స్టో సూప‌ర్ షో..

హైద‌రాబాద్‌: సౌతాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ అయిదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.  శుక్ర‌వారం కేప్‌టౌన్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో.. ఇంగ్లండ్ ప్లేయ‌ర్ జానీ బెయిర్‌స్టో హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.  తొలుత ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 179 ర‌న్స్ చేసింది.  సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ డూప్లెసిస్ అత్య‌ధికంగా 58 ర‌న్స్ చేశాడు.  ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సామ్ కుర్ర‌న్ 28 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.  భారీ ల‌క్ష్యంతో చేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. తొలుత 27 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ ద‌శ‌లో క్రీజ్‌లోకి వ‌చ్చిన బెయిర్‌స్టో భారీ షాట్ల‌తో హోరెత్తించాడు.  48 బంతుల్లోనే అత‌ను 9 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో అజేయంగా 86 ర‌న్స్ చేశాడు. బెన్ స్టోక్స్‌తో క‌లిసి ఇద్ద‌రూ 85 ర‌న్స్ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.  స్టోక్స్ 27 బంతుల్లో 37 ర‌న్స్ చేశాడు.  

స్కోరుబోర్డు

ద‌క్షిణాఫ్రికా 179-6 (20 ఓవ‌ర్లు):  డూప్లెసిస్‌ 58 (40),  కుర‌న్ 3-28

ఇంగ్లండ్ 183-5 (19.2 ఓవ‌ర్లు):  బెయిర్‌స్టో 86* (48), స్టోక్స్‌ 37 (27), లిండే 2-2