శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 31, 2020 , 00:00:00

ఇంగ్లండ్‌ బోణీ

ఇంగ్లండ్‌ బోణీ

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన పాకిస్థాన్‌.. టీ20 ల్లోనూ అదే ప్రదర్శన కొనసాగించిం ది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌ లో ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మహమ్మద్‌ హఫీజ్‌ (69), బాబర్‌ ఆజమ్‌ (56) అర్ధశతకాలు బాదడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో కెప్టెన్‌ మోర్గాన్‌ (66; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్‌ మలన్‌ (54 నాటౌట్‌) రాణించడంతో ఇంగ్లండ్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. 


logo