శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 03:35:57

మోర్గాన్‌ మెరుపు శతకం

 మోర్గాన్‌ మెరుపు శతకం

  • ఇంగ్లండ్‌ 328 ఆలౌట్‌

సౌతాంప్టన్‌: కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో ఐర్లాండ్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్‌ జట్టు 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు జాసన్‌ రాయ్‌ (1), బెయిర్‌స్టో (4)తో పాటు విన్స్‌ (16) విఫలమవడంతో ఇంగ్లిష్‌ జట్టు 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బాన్‌టన్‌ (58; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో కలిసి మోర్గాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

గతంలో ఐర్లాండ్‌ తరఫున ఆడిన అనుభవం ఉన్న మోర్గాన్‌.. ఐరిష్‌ బౌలర్లను ఉతికారేశాడు. సెంచరీ అనంతరం మోర్గాన్‌ ఔట్‌ కాగా.. 26 పరుగుల తేడాలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. చివర్లో విల్లే (42 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), టామ్‌ కరన్‌ (38 నాటౌట్‌) రాణించడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేయగలిగింది. ఐర్లాండ్‌ బౌలర్లలో యాంగ్‌కు 3, లిటిల్‌, కాంపెర్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌ 2-0తో సిరీస్‌ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. 


logo