లండన్: యూరో కప్-2020లో సంచలన ఫలితాలు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం జర్మనీతో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున రహీమ్ స్టిర్లింగ్ (75ని), కెప్టెన్ హ్యారీ కేన్ (86ని) గోల్స్ చేశారు. వచ్చే నెల 4న జరిగే క్వార్టర్స్‌లో స్వీడన్ లేదా ఉక్రెయిన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది.