శుక్రవారం 10 జూలై 2020
Sports - Feb 29, 2020 , 13:01:49

తొలిరోజు ముగిసేసరికి కివీస్‌.. 63-0

తొలిరోజు ముగిసేసరికి కివీస్‌.. 63-0

క్రైస్ట్‌చర్చ్‌: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజు ముగిసే సరికి న్యూజిలాండ్‌ జట్టు 23 ఓవర్లలో వికెట్లేమి కోల్పోకుండా 63 పరుగులు సాధించింది. ఓపెనర్లు.. టామ్‌ లాథమ్‌(27 నాటౌట్‌), టామ్‌ బ్లండెల్‌(29 నాటౌట్‌) సమయోచిత బ్యాటింగ్‌తో తొలివికెట్‌కు 63 పరుగులు జోడించారు. 23 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేసిన ఈ జంట.. భారత బౌలర్లకు ఎక్కడా చాన్స్‌ ఇవ్వలేదు. 

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా.. 63 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్‌ అయింది.  యువ ఆటగాడు పృథ్వి షా(54), ఛటేశ్వర్‌ పుజారా(54), హనుమ విహారీ(55) అర్ధసెంచరీలతో రాణించారు. మిగితా బ్యాట్స్‌మెన్‌ ఎవ్వరూ అంతగా ఆకట్టుకోలేదు. తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(3) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. టిమ్‌ సౌథీ బౌలింగ్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. తొలి టెస్టులో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(7) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు.

కివీస్‌ బౌలర్లలో జెమీసన్‌ 5 వికెట్లు పడగొట్టి, ఇండియా పతనాన్ని శాసించాడు. టిమ్‌ సౌథీ, బౌల్ట్‌ రెండేసి వికెట్లతో రాణించగా.. వాగ్నర్‌ ఓ వికెట్‌ తీశాడు. భారత స్కోరును రీచ్‌ అవ్వడానికి కివీస్‌ ఇంకా 179 పరుగులు వెనుకబడి ఉంది. 


logo