మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 02:39:38

మహేశ్వరికి ప్రోత్సాహం

మహేశ్వరికి ప్రోత్సాహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగే జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ శిబిరానికి తెలంగాణ యువ అథ్లెట్‌ మహేశ్వరి తొలిసారి ఎంపికైంది. పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతున్న మహేశ్వరికి సాయ్‌ గోపీచంద్‌ మైత్రా ఫౌండేషన్‌ చేయూత అందించింది. వ్యక్తిగత ఖర్చుల కోసం మహేశ్వరికి గోపీచంద్‌ తల్లి పుల్లెల సుబ్బరావమ్మ పదివేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌తో పాటు గోపీచంద్‌ పాల్గొన్నారు.