శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 22:32:55

ఐపీఎల్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం: ఎమిరేట్స్ బోర్డు

ఐపీఎల్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం: ఎమిరేట్స్ బోర్డు

ముంబై: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్‌కు సంబంధించిన అధికారిక ప‌త్రాల‌ను బీసీసీఐ నుంచి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మంగ‌ళ‌వారం అందుకుంది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ మ‌న దేశంలో ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈ ఏడాది లీగ్‌ను యూఏఈలో జ‌రుపాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. 

ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ షేక్ న‌హ‌య‌న్ మ‌బార‌క్ అలీ మంగ‌ళ‌వారం మాట్లాడుతూ.. `ప్ర‌జ‌లంద‌రికీ ఇష్ట‌మైన లీగ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాం. దీనికి సంబంధించిన అధికారిక ప‌త్రాలు మాకు అందాయి. లీగ్‌ను విజ‌యవంతంగా నిర్వ‌హించేందుకు శాయ‌శ‌క్తుల కృషిచేస్తాం. యూఏఈలో స్పోర్ట్స్ ఈవెంట్‌లు చాలా జాగ్ర‌త్త‌గా జ‌రుగుతున్నాయి. అందులో ఐపీఎల్‌ను ఇంకా అత్యుత్త‌మంగా న‌ర్వ‌హించ‌డ‌మే మా బాధ్య‌త‌`అని అన్నారు. logo