గురువారం 13 ఆగస్టు 2020
Sports - Aug 01, 2020 , 13:14:58

యూఏఈలో ఐపీఎల్‌.. 50 శాతం వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి !

యూఏఈలో ఐపీఎల్‌.. 50 శాతం వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి !

హైద‌రాబాద్‌: ఐపీఎల్ -13ను నిర్వ‌హించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ క్ల‌బ్ ఆస‌క్తిగా ఉన్న‌ది. అయితే స్టేడియాల్లోకి ఎంత మంది ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తార‌న్న విష‌యంపై ఈసీబీ ఓ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను వీక్షించేందుకు స్టేడియాల్లోకి 30 నుంచి 50 శాతం వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కార్య‌ద‌ర్శి ముబాషిర్ ఉస్మాని తెలిపారు.  కానీ అభిమానుల ఎంట్రీకి సంబంధించి త‌మ ప్ర‌భుత్వం నుంచి తుది అనుమ‌తి రావాల్సి ఉంటుంద‌న్నారు. క‌రోనా వైర‌స్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో ఈ అంశం కీల‌కంగా మారింది.   

స్టేడియాల్లోకి ప్రేక్ష‌కుల అనుమ‌తిపై యూఏఈ ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్ ఇటీవ‌ల పేర్కొన్న విష‌యం తెలిసిందే. భార‌త, యూఏఈ ప్ర‌భుత్వాలు.. ఐపీఎల్ 13కు ఓకే చెప్పేస్తే, స్టేడియాల్లో ప్రేక్ష‌కుల అంశంపై క్లారిటీ వ‌స్తుంద‌ని ముబాషిర్ తెలిపారు. స్టేడియాల్లో ప్రేక్ష‌కుల సామ‌ర్థ్యంపై త‌మ ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పందన వ‌స్తుంద‌న్న అభిప్రాయాన్ని ముబాషిర్ వ్య‌క్తం చేశారు. దుబాయ్‌, అబు దాబి, షార్జా స్టేడియాల‌కు మ్యాచ్ నిర్వ‌హ‌ణ కోసం సిద్ధంగా ఉండాల‌ని కూడా తెలియ‌జేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. శిక్ష‌ణ కోసం మూడు వారాల ముందే జ‌ట్లు యూఏఈ రానున్న‌ట్లు చెప్పారు.  


logo