శనివారం 04 జూలై 2020
Sports - Jun 27, 2020 , 00:26:29

కోర్‌ గ్రూప్‌లో ఎలవెనిల్‌

కోర్‌ గ్రూప్‌లో ఎలవెనిల్‌

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 34 మంది షూటర్ల కోర్‌ గ్రూప్‌లో ఎలవెనిల్‌ వలరివన్‌, అనీశ్‌ భన్వాల్‌ చోటు దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక విశ్వక్రీడల్లో పతకం సాధించే సత్తా ఉన్న షూటర్లకు భారత రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) త్వరలో అత్యుత్తమ శిక్షణ ఇవ్వనుంది. ఈ 34 మందిలో ఇప్పటికే 15 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా.. మిగిలిన వాళ్లు బెర్త్‌ దక్కించుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ షూటర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఇవ్వనున్నట్లు ఎన్‌ఆర్‌ఏఐ అధికారి శుక్రవారం తెలిపారు.



logo