మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 15, 2020 , 15:12:14

ఎనిమిదేళ్ల తరువాత ధోనీతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది : చావ్లా

ఎనిమిదేళ్ల తరువాత ధోనీతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది : చావ్లా

ఐపీఎల్ 2020 వేలంలో పియూష్ చావ్లాను చెన్నై సూపర్ కింగ్స్ రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది. చావ్లా చివరిసారి 2012లో టీమిండియా తరపున ఆడాడు. ఆ తరువాత కేవలం దేశవాళి, ఐపీఎల్‌ టోర్నీలు మాత్రమే ఆడుతున్నాడు. తనను ధోని సీఎస్‌కేలోకి తీసుకోవడం గురించి చావ్లా మాట్లాడుతూ ఎనిమిదేళ్ల తరువాత ధోనీ కెప్టెన్సీలో క్రికెట్‌ ఆడటం సంతోషంగా ఉందన్నాడు. అత్యుత్తమ కెప్టెన్‌తో కలిసి ఆడటం కన్నా ఇంకేం కావాలి..? అని చావ్లా అన్నాడు. మొదట కోల్‌కతా జట్టులో ఆడిన చావ్లాను జట్టులో బలమైన స్పిన్‌ లైనప్‌ ఉన్నప్పటికీ ధోని ఎంపిక చేసుకున్నాడు.  

ఇదే విషయమై చావ్లా మీడియాతో మాట్లాడుతూ అద్భుతమైన కెప్టెన్ కింద ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారన్నాడు. “ఒక కెప్టెన్ మిమ్మల్ని విశ్వసిస్తే, మీకు అంతకన్నా ఏం కావాలి?. చాలా కాలం తరువాత ధోని భాయ్‌తో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. అతడు బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు. మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండని ప్రోత్సహిస్తాడు. ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటాడు. బౌలర్‌కు సూచనలు చేయాల్సి వచ్చినప్పుడల్లా వికెట్ల వెనుక నుంచి సలహా ఇస్తుంటాడు.” అని చావ్లా అన్నాడు.

ఈ ఏడాది యూఏఈలో జరుగనున్న ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లో సీఎస్‌కే ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలువగా.. ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు టైటిల్‌ గెలుచుకుంది.

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo