మంగళవారం 02 జూన్ 2020
Sports - Apr 03, 2020 , 16:14:06

క‌రోనా ప‌రీక్షా కేంద్రంగా ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియం

క‌రోనా ప‌రీక్షా కేంద్రంగా ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియం

లండ‌న్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న త‌రుణంలో ప్ర‌తీ ఒక్క‌రు త‌మ వంతు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఇంగ్లండ్‌లో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉండ‌టంతో వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు యుద్ధ ప్రాతిప‌దిక‌న స‌హాయ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప్ర‌తిష్ఠాత్మ‌క లార్డ్స్ క్రికెట్ స్టేడియంను.. వైద్య సిబ్బంది పార్కింగ్ కేంద్రంగా ప్ర‌క‌టించగా.. తాజాగా ఎడ్జ్‌బాస్ట‌న్ మైదానాన్ని కొవిడ్‌-19 ప‌రీక్ష కేంద్రంగా మార్చాల‌ని నిర్ణ‌యించారు. గ్రౌండ్‌ను నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్ (ఎన్‌హెచ్ఎస్‌) వారికోసం కేటాయిస్తున్న‌ట్లు వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్ల‌బ్ (డ‌బ్ల్యూసీసీసీ) శుక్ర‌వారం పేర్కొంది. 

`ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మా దేశంలో ఆట‌ల కంటే ఆరోగ్యమే ముఖ్యం. క్రీడ‌ల‌కు సంబంధించిన అన్ని ఈవెంట్‌లు మే 29 వ‌ర‌కు వాయిదా ప‌డ్డ నేప‌థ్యంలో.. ఎడ్జ్‌బాస్ట‌న్ మైదానాన్ని వైద్య సిబ్బందికి కేటాయించాల‌ని నిర్ణ‌యించాం` అని డ‌బ్ల్యూసీసీసీ చీఫ్ తెలిపారు. ఇంగ్లండ్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌తో పాటు ప్రిన్స్ చార్లెస్‌కు కూడా ఈ వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. 


logo