బుధవారం 03 జూన్ 2020
Sports - Mar 28, 2020 , 14:07:05

యుద్ధం చేద్దాం - కరోనాపై బ్రావో పాట

యుద్ధం చేద్దాం - కరోనాపై బ్రావో పాట

కరోనా వైరస్​(కొవిడ్​-19)పై అవగాహన కల్పించేందుకు వెస్టిండీస్ ఆల్​రౌండర్ డ్వైన్ బ్రావో పాటను విడుదల చేశాడు. స్వయంగా తానే పాట పాడి డ్యాన్స్ చేశాడు. కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. ​అందరూ ఇండ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాంటూ సూచించాడు. ‘వీ ఆర్ నాట్ గివింగ్ అప్’ పేరిట ఇన్​స్టాగ్రామ్​లో ఈ పాటను శనివారం పోస్ట్ చేశాడు. నమస్కారంతో బ్రావో పాటను ప్రారంభించడం విశేషం. ఇదివరకే ఎన్నోసార్లు బ్రావో తన గాత్రం, నృత్యంతో అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. కాగా,  ఇప్పటికే టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీతో పాటు అనేక మంది క్రికెటర్లు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాల్లో సందేశాలిచ్చారు. ఇండ్లకే పరిమితం కావాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచించారు. 


logo