సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 22, 2020 , 01:57:59

ఐపీఎల్‌ నుంచి బ్రావో నిష్క్రమణ

ఐపీఎల్‌ నుంచి బ్రావో నిష్క్రమణ

దుబాయ్‌: ఈ ఏడాది ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వైన్‌ బ్రావో గాయం కారణంగా ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ బుధవారం వెల్లడించాడు. కండరాల గాయంతో బ్రావో ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడని చెప్పాడు. ఈనెల 17వ తేదీన షార్జాలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో చివరి ఓవర్‌ వేయలేకపోవడంతో బంతి అందుకున్న జడేజా మూడు సిక్సర్లు సమర్పించుకోవడంతో చెన్నై ఓడిపోయింది. 10 మ్యాచ్‌ల్లో ఏడింట ఓడి ప్లేఆఫ్స్‌లో చోటు కష్టమైన సమయంలో అతడి నిష్క్రమణ ధోనీసేనకు మరింత సవాల్‌గా మారనుంది. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన బ్రావో ఆరు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో ఏడు పరుగులే చేశాడు.