గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 07, 2020 , 22:17:54

ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించిన డ్వేన్‌ బ్రావో

ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించిన  డ్వేన్‌ బ్రావో

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో  చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో 150 వికెట్లు మైలురాయి అందుకున్న ఐదో బౌలర్‌కు అతడు రికార్డు నెలకొల్పాడు.  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో యువ బ్యాట్స్‌మన్‌ శివమ్‌ మావిని ఔట్‌ చేయడం ద్వారా  బ్రావో ఈ ఫీట్‌ చేరుకున్నాడు.

చాలా ఏండ్లుగా చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రావో కీలక సమయాల్లో అటు బంతితో..ఇటు బ్యాట్‌తో జట్టును ఆదుకున్నాడు. నిలకడైన ప్రదర్శన  చేస్తూ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.  ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 137 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 102 ఇన్నింగ్స్‌ల్లో  1483 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో  అత్యధిక  వ్యక్తిగత స్కోరు 70 కాగా ఐదు అర్ధశతకాలు నమోదు చేశాడు.