బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 27, 2020 , 03:01:52

బ్రావో కొత్త చరిత్ర

బ్రావో కొత్త చరిత్ర

  • టీ20ల్లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా.

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వైన్‌ బ్రావో చరిత్ర లిఖించాడు. పొట్టి ఫార్మాట్‌లో 500వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరఫున ఆడుతున్న బ్రావో సెయింట్‌ లూసియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కార్న్‌వాల్‌ను ఔట్‌ చేసి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్‌ సహా వివిధ లీగ్‌లు మొత్తం కలిపి ఇప్పటి వరకు 23 జట్ల తరఫున బ్రావో 459 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టీ20ల్లో అత్యధిక వికెట్ల జాబితాలో బ్రావో తర్వాతి స్థానంలో శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగ(390వికెట్లు) ఉన్నాడు. బ్రావో మినహా మిగిలిన ఎవరూ ఇంతవరకు 400వికెట్ల మార్కును సైతం చేరుకోలేకపోయారు. అలాగే టీ20ల్లో 300, 400వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ బ్రావోనే నిలిచిన సంగతి తెలిసిందే. 


logo