సెయింట్ కిట్స్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో 500 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా అతడు గుర్తింపు పొందాడు. బుధవారం సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఫైనల్ మ్యాచ్ ఆడి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో విండీస్‌కే చెందిన మరో ఆల్‌రౌండర్ పొలార్డ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 500 టీ20లు ఆడిన బ్రావో.. 6,566 పరుగులు చేసి 540 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక పొలార్డ్ 561 మ్యాచ్‌ల్లో 11,159 పరుగులు చేసి 298 వికెట్లు తీశాడు. ఇదిలాఉండగా సీపీఎల్‌లో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బ్రావో సారథ్యంలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్యాట్రియాట్స్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సెయింట్ లూసియా కింగ్స్‌పై మూడు వికెట్ల తేడాతో గెలిచింది.