మంగళవారం 31 మార్చి 2020
Sports - Mar 19, 2020 , 00:18:05

టోక్యో బెర్త్‌పై ద్యుతీ ఆందోళన

టోక్యో బెర్త్‌పై ద్యుతీ ఆందోళన

భువనేశ్వర్‌: కరోనా వైరస్‌ ప్రభావంతో జర్మనీలో జరగాల్సిన పలు అథ్లెటిక్స్‌  పోటీలు రద్దవడంతో భారత అగ్రశ్రేణి స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌కు నిరాశ ఎదురైంది. విశ్వక్రీడలకు అర్హత సాధించాలన్న ఆమె లక్ష్యం ఇప్పటికి నిలిచిపోయింది. గతంలోనే వీసా మంజూరైనా కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో జర్మనీకి వెళ్లేందుకు ద్యుతీకి అనుమతి లభించలేదు. ‘వీసాతో పాటు జర్మనీకి వెళ్లేందుకు కావాల్సిన పత్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయితే వైరస్‌ కారణంగా ఇక్కడికి వచ్చేందుకు వీల్లేదంటూ ఆ దేశంలోని ట్రైనింగ్‌ క్యాంప్‌ నుంచి సందేశం వచ్చింది. నేను చాలా నిరాశచెందా’ అని ద్యుతీ చెప్పింది. 100మీటర్ల పోటీలో ఒలింపిక్స్‌ అర్హత 11.15సెకన్లు కాగా, ఈ మార్క్‌ను అందుకునే అవకాశం చేజారిందని ద్యుతీ నిరాశ వ్యక్తం చేసింది. 


logo
>>>>>>