మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 29, 2020 , 00:36:19

డుప్లెసిస్‌.. డబుల్‌ మిస్‌

డుప్లెసిస్‌.. డబుల్‌ మిస్‌

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (199; 24 ఫోర్లు) తృటిలో ద్విశతకం చేజార్చుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత ఇన్నింగ్స్‌తో కదం తొక్కిన డుప్లెసిస్‌ డబుల్‌ సెంచరీకి పరుగు దూరంలో ఔటయ్యాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 621 పరుగుల భారీ స్కోరు చేసింది. బవుమా (71), కేశవ్‌ మహరాజ్‌ (73) రాణించారు. లంక బౌలర్లలో వణిండు హసరంగ 4, విశ్వ ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లంక సోమవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న లంక జట్టు.. సఫారీ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 160 పరుగులు వెనుకబడి ఉంది. కుషాల్‌ పెరెరా (33), చండిమల్‌ (21) క్రీజులో ఉన్నారు.