ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 17, 2020 , 20:17:20

DC vs CSK: దూకుడు పెంచిన డుప్లెసిస్‌, వాట్సన్‌

DC vs CSK:  దూకుడు పెంచిన  డుప్లెసిస్‌, వాట్సన్‌

షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిలకడగా ఆడుతోంది.  ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే  శామ్‌ కరన్‌(0) వికెట్‌ను చెన్నై కోల్పోయింది.  గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఫర్వాలేదనిపించిన కరన్‌ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు.     ఈ దశలో క్రీజులో ఉన్న వాట్సన్‌, డుప్లెసిస్‌ ఆచితూచి ఆడుతున్నారు. పవర్‌ప్లే ఆఖరికి  39/1తో నిలిచింది. 

 తుషార్‌ దేశ్‌పాండే వేసిన మూడో ఓవర్‌లో వాట్సన్‌ రెండు ఫోర్లు కొట్టి 10  రన్స్‌ రాబట్టాడు.  నోర్ట్జే వేసిన ఐదో ఓవర్లో డుప్లెసిస్‌ ఒక సిక్స్‌, రెండు ఫోర్లు బాది 14 పరుగులు సాధించాడు.  డప్లెసిస్‌, వాట్సన్‌  ఇప్పటికే 60కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 10 ఓవర్లకు చెన్నై వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది. డుప్లెసిస్‌(36), వాట్సన్‌(34) క్రీజులో ఉన్నారు.