ఆదివారం 05 జూలై 2020
Sports - May 14, 2020 , 15:54:11

ఆట‌గాళ్ల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచాలి: డుప్లెసిస్‌

ఆట‌గాళ్ల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచాలి:  డుప్లెసిస్‌

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా విశ్వ‌వ్యాప్తంగా క్రీడా టోర్నీల‌న్నీ ర‌ద్దు అవుతుండ‌టంతో.. ఈ ఏడాది చివ‌ర్లో ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగ‌నున్న పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై కూడా నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ముంద‌స్తు షెడ్యూల్ ప్ర‌కారం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హించాలంటే.. అంత‌కు రెండు వారాల ముందే జ‌ట్ల‌కు ఐసోలేష‌న్ విధించాల‌ని ద‌క్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మ‌న్ ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. 

`ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హించేందుకు ముందు ఆట‌గాళ్ల‌ను రెండు వారాల పాటు ఐసోలేష‌న్‌లో ఉంచాలి. అలాగే మెగాటోర్నీ ముగిసిన అనంత‌రం కూడా ఇదే ఫాలో అవ్వాలి` అని డుస్లెసిస్ అన్నాడు. ఇప్ప‌టికే కొవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌తిష్ఠాత్మ‌క టోక్యో ఒలింపిక్స్ వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డ‌గా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే.logo