శనివారం 04 జూలై 2020
Sports - May 04, 2020 , 23:12:27

మూడు ఫార్మాట్ల‌లో ఆడాలనుకుంటున్నా: డుప్లెసిస్‌

మూడు ఫార్మాట్ల‌లో ఆడాలనుకుంటున్నా:  డుప్లెసిస్‌

కేప్‌టౌన్‌: ఆట‌లోని మూడు ఫార్మాట్‌ల‌లో కొన‌సాగాల‌నుకుంటున్న‌ట్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మ‌న్ ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న డుప్లెసిస్‌.. టెస్టు కెప్టెన్‌గా కొన‌సాగుతున్నాడు. అయితే షెడ్యూల్ ప్ర‌కారం జూలైలో జ‌ర‌గాల్సి ఉన్న వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారా లేక కొత్త సార‌థిని ఎంపిక చేస్తారా అనే విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. 

`ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌డాన్ని ఆస్వాదిస్తా. ప్ర‌స్తుతం మూడు ఫార్మాట్‌ల‌లో కొన‌సాగాల‌నుకుంటున్నా. ప్ర‌ద‌ర్శ‌న బాగున్న‌న్ని రోజులు ఆడుతా. ప‌ద‌మూడేండ్ల ప్రాయం నుంచే సార‌థ్య బాధ్య‌త‌లు మోస్తున్నా. అయితే ఇప్పుడు నాయ‌కత్వ మార్పు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌రొక‌రు బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క త‌ప్ప‌దు` అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. 2016లో డివిలియ‌ర్స్ నుంచి ప‌గ్గాలు అందుకున్న ద‌గ్గ‌రి నుంచి టెస్టు క్రికెట్‌లో డుప్లెసిస్ కెప్టెన్‌గా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.logo