భారత్‌కు డబుల్ గోల్డ్ బాక్సింగ్

- ప్రపంచకప్‌లో మొత్తం 9 పతకాలు
న్యూఢిల్లీ: బాక్సింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో రెండు స్వర్ణ పతకాలు దక్కాయి. జర్మనీ వేదికగా టోర్నీ జరుగగా.. చివరి రోజు పోటీలో మహిళా బాక్సర్లు సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీలు), మనిశ్ (57 కేజీలు) సత్తాచాటి పసడి పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఈ టోర్నీలో భారత్ ఖాతాలో మొత్తం 9 పతకాలు చేరినైట్లెంది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో మనిశ్ 3-2 తేడాతో సాస్కిపై గెలువగా.. సిమ్రన్‌జీత్ 4-1 తేడాతో మయ క్లియెన్హాస్ (జర్మనీ)పై విజయం సాధించింది.
ఫైనల్ ఫైట్‌లో సిమ్రన్‌జీత్ ఎదురు లేకుండా దూసుకెళ్లి.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పంచ్‌ల వర్షం కురిపిస్తే.. మనిశ్ మాత్రం హోరాహోరీ పోరులో పైచేయి సాధించి పసిడి ఖాయం చేసుకుంది. కాగా శనివారం పురుషుల ఫైనల్లో అమిత్ పంగాల్ (52 కేజీలు) స్వర్ణం సాధించగా.. సతీశ్ కుమార్ (+91 కేజీలు) రజతం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు), సోనియా లాథర్ (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), గౌరవ్ సొలాంకి (57 కేజీలు) వారి కేటగిరీల్లో కాంస్యాలు దక్కించుకున్నారు. జర్మనీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌తో పాటు బెల్జియం, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, మోల్దోవా, నెదర్లాండ్స్, పొలాండ్, ఉక్రెయిన్ బాక్సర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్‌పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్