శనివారం 11 జూలై 2020
Sports - Apr 23, 2020 , 22:04:26

అదే ధోనీ లాస్ట్ మ్యాచ్‌: భ‌జ్జీ

అదే ధోనీ లాస్ట్ మ్యాచ్‌: భ‌జ్జీ

న్యూఢిల్లీ:  టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్రసింగ్ ధోనీ తిరిగి జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాల‌ని అనుకోక‌పోవ‌చ్చ‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ పేర్కొన్నాడు. స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌తో గురువారం ఇన్‌స్టా గ్రామ్ లైవ్‌లో పాల్గొన్న భ‌జ్జీ పై వ్యాఖ్య‌లు చేశాడు. గతేడాది ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌లే ధోనీ కెరీర్‌లో చివ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్ అయివుండొచ్చ‌ని భ‌జ్జీ అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఇన్‌స్టా లైవ్ సంద‌ర్భంగా ధోనీ తిరిగి ఎప్పుడు అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడుతాడు అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు రోహిత్ బ‌దులిస్తూ.. `ఈ ప్ర‌శ్న మీరు ధోనీనే అడిగితే స‌రైన స‌మాధానం ల‌భిస్తుంది` అని అన్నాడు. దీనిపై స్పందించిన భ‌జ్జీ.. `భార‌త్ త‌ర‌ఫున ధోనీ చివ‌రి మ్యాచ్ ఆడేశాడ‌ని నా అభిప్రాయం. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన సెమీఫైన‌లే  ధోనీకి చివ‌రి మ్యాచ్. ఇక అత‌డు తిరిగి టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హిస్తాడ‌ని నేను అనుకోవ‌డం లేదు` అని చెప్పాడుlogo