శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 17, 2020 , 00:13:13

క్రీడాకారులు.. ఆత్మైస్థెర్యం కోల్పోకండి

క్రీడాకారులు.. ఆత్మైస్థెర్యం కోల్పోకండి

న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా.. క్రీడాటోర్నీలన్నీ రద్దవుతున్న నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు.. ఆటగాళల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. క్లిష్ట సమయంలో క్రీడాకారులు ైస్థెర్యాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చారు. ‘కొవిడ్‌-19 ప్రభావంతో క్రీడా ఈవెంట్‌లన్నీ వాయిదా పడుతున్నా.. ఆటగాళ్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ప్రా క్టీస్‌ కొనసాగిస్తూ.. శిక్షణపై మరింత దృష్టిపెట్టి ముందుకు సాగండి’ అని రిజిజు ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 


logo